
తన ఇంటి ముందు టేబుళ్లు ఏర్పాటు చేయడంపై ఆమె నిర్వాహకులతో వాగ్వాదానికి దిగింది. ఈ వివాదం మరింత ముదరడంతో ఆగ్రహానికి గురైన ఆ మహిళ, తన ఇంటి మొదటి అంతస్తు నుంచి కింద అన్నప్రసాదం పంపిణీ చేస్తున్న ప్రాంతంపైకి చేపలు శుభ్రం చేసిన నీటిని, వ్యర్థాలను కిందకు పారబోసింది. పవిత్రమైన నవరాత్రి ప్రసాదంపై నాన్‌వెజ్ వ్యర్థాలు పడటంతో అక్కడ ఉన్న హిందూ భక్తులు, స్థానికులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఈ ఘటనపై బాధితులు వెంటనే స్థానిక నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం , మతకలహాలను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయన్యాయ సంహిత (BNS) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితురాలైన నూర్జహాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అనంతరం ఆమెను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, కోర్టు ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.